Latest Updates
పంచాయతీ ఎన్నికలపై క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటాం: మహేశ్ కుమార్ గౌడ్
స్థానిక సంస్థల ఎన్నికలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ వెల్లడించారు. రేపు జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ చేపట్టే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని మహేశ్ స్పష్టం చేశారు. అలాగే, ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల పేర్లను వెల్లడించాలని సిట్‌ను ఆయన కోరారు. ఈ ట్యాపింగ్‌లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ ప్రమేయం ఉన్నట్లు తాము భావిస్తున్నామని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.