Devotional

అరసవల్లి సూర్య భగవానుడి ఆలయంలో అద్భుతం ఆవిష్కృతం..

శ్రీకాకుళం ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం (Arasavalli Suryanarayana Swamy Temple)లో అద్భుతం ఆవిష్క్రతమైంది. మొదటి రోజు సూర్య కిరణాలు స్వామివారి మూల విరాట్‌ను తాకాయి. మొదటి రోజు భక్తులు ఆ దృశ్యాన్ని కనులారా చూసి పునీతులయ్యారు. ఉత్తరాయణం, దక్షిణాయణం కాలాల మార్పుల్లో భాగంగా ప్రతీ ఏడాది మార్చి , అక్టోబరు నెలల్లో రెండు రోజుల పాటు సూర్య కిరణాలు ఆలయ గర్భగుడిలో ఉన్న సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను తాకడం ఆనవాయితీగా ఉంది. దాదాపు ఐదు నిమిషాల పాటు సూర్యకిరణాలు స్వామివారిని తాకాయి.

సూర్యకిరణాలు తాకే వేళ సూర్యనారాయణమూర్తిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదిత్యుని విగ్రహాంపై పడిన ఆ లేలేత కిరణాలు దర్శనమివ్వడంతో జన్మధన్యమైందని సూర్యభగవానుడికి పూజలు చేశారు. సూర్యుడుని కిరణాలు శిరస్సునుంచి స్వామి వారి పాదాల వరకు తాకాయని భక్తులు చెబుతున్నారు. ఎప్పటినుంచో ఈ అద్భుత దృశ్యాన్ని చూడాలనుకుంటున్నామని.. ఇప్పుడు ఆ ఆ దర్శన భాగ్యం తమకు కలుగడం సంతోషంగా ఉందంటున్నారు. భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో వేచి ఉండి స్వామివారిని సూర్యకిరణాలు తాకడం చూసి భక్తులు పులకించిపోయారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version