Andhra Pradesh

ఉత్తరాంధ్రకు ‘మూలపేట’ కళ: ఏప్రిల్‌లో పోర్టు ట్రయల్ రన్.. మూడు జిల్లాలకు భారీ లబ్ధి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూలపేట పోర్టు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలోని ఈ పోర్టును అత్యాధునిక హంగులతో నిర్మిస్తుండగా, రాబోయే ఏప్రిల్‌ నెలలో షిప్‌ల ట్రయల్ రన్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

నిర్మాణ వ్యయం తొలి దశలో రూ. 4,361 కోట్లు పనుల వేగం నార్త్, సౌత్ బ్రేక్ వాటర్స్ పనులు (అలల తాకిడిని తట్టుకునే గోడలు) పూర్తయ్యాయి. దీని కోసం ఏకంగా 32 లక్షల టన్నుల రాయిని ఉపయోగించారు,మొత్తం ప్రాజెక్టు మూడు జనరల్ బెర్తులకు గానూ రెండు పూర్తయ్యాయి,మూడవది ఏప్రిల్‌లోగా సిద్ధం కానుంది,కోల్ బెర్త్ పనులు కూడా 50% పూర్తయ్యాయి.పోర్టుకు సరుకు రవాణా సులభతరం చేసేందుకు ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాలను కల్పిస్తోంది,రోడ్డు మార్గం చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారికి (NH-16) అనుసంధానిస్తూ 12.85 కి.మీ మేర రోడ్డు నిర్మాణం.రైల్వే మార్గం: చెన్నై-హౌరా ప్రధాన లైన్‌ను కనెక్ట్ చేస్తూ 7.8 కి.మీ రైల్వే లైన్,తాగునీరు: గొట్టా బ్యారేజీ నుంచి 50 కి.మీ పైప్‌లైన్ ద్వారా నీటి సరఫరా.

పారిశ్రామిక హబ్‌గా మూలపేట,ఈ పోర్టు కేవలం రవాణాకే పరిమితం కాకుండా, ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్‌గా అవతరించబోతోంది. దాదాపు 10 వేల ఎకరాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం భూములను సేకరిస్తోంది. దీనివల్ల శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. నవంబర్ నాటికి పూర్తిస్థాయిలో పోర్టును అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతర సమీక్షలు నిర్వహిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version