Connect with us

News

RTC ఆర్థికంగా పటిష్టంగా మారింది: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌గా తెలంగాణ : భట్టి విక్రమార్క

రాష్ట్రంలో ప్రజా రవాణా సంస్థ అయిన ఆర్టీసీ (RTC) ఆర్థికంగా నిలదొక్కుకున్నదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేటు 67 శాతం నుంచి 90 శాతానికి పెరిగిందని తెలిపారు. ప్రయాణికుల స్పందనతో సంస్థ ఆదాయంలో పెరుగుదల నమోదైందని తెలిపారు.

ఇటీవల RTC కొత్త బస్సుల కొనుగోలు కూడా చేపట్టిందని భట్టి వెల్లడించారు. ఉచిత ప్రయాణాల సంఖ్య 200 కోట్లకు చేరిన సందర్భంగా హైదరాబాద్‌లోని MGBS బస్టాండ్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మంత్రులు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ, ఉచిత ప్రయాణ పథకం ద్వారా మహిళలు ఇప్పటివరకు రూ. 6,680 కోట్ల మేర ఆదా చేసుకున్నారని చెప్పారు. ఇది రాష్ట్ర మహిళలకు ఆర్థికంగా ఎంతగానో ఉపశమనం కలిగించిందని అన్నారు. RTC సేవలను మరింత విస్తరించి ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యమని మంత్రులు పేర్కొన్నారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *