Connect with us

Latest Updates

ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌కు బిజినెస్‌మెన్ రూ. కోటి రోలెక్స్ వాచ్ గిఫ్ట్

ఇల్లు కట్టిన కాంట్రాక్టర్‌కు బిజినెస్‌మెన్ రూ. కోటి రోలెక్స్ వాచ్ గిఫ్ట్

ఓ బిజినెస్‌మెన్ తన గొప్ప మనసును చాటుకున్నాడు. తన ఇంటిని కట్టిన కాంట్రాక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. తన ఇంటిని తొందరగా, అద్భుతంగా, నాణ్యతతో కట్టడంతోపాటు తన ఇంటి నిర్మాణం పట్ల ఆ కాంట్రాక్టర్ చూపించిన ప్రత్యేక శ్రద్ధకు ఆ బిజినెస్‌మెన్ మంత్రముగ్ధుడు అయిపోయాడు తన ఇంటి నిర్మాణానికి గుర్తుగా, ఆ కాంట్రాక్టర్‌కు ఏకంగా రూ. కోటి విలువ చేసే రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు.అది చూసి ఆ కాంట్రాక్టర్ ఆనందంతో పొంగిపోయాడు .

చాలా మంది ధనవంతులు తమ వద్ద పనిచేసే వారికి డబ్బులు, బహుమతులు ఇస్తారు, ఇది సాధారణమే. కానీ ఓ బిజినెస్‌మెన్ తన కోసం ఒక ఖరీదైన భవనం కట్టించాడు. అది కేవలం ఇల్లు కాకుండా, ఒక రాజు కోసం కట్టిన కోటలా కనిపిస్తుంది. ఆ భవనాన్ని కట్టించినందుకు, ఆ యజమాని ఆ కాంట్రాక్టర్‌కు జీవితంలో మరిచిపోలేని బహుమతిని ఇచ్చాడు.

అందుకు కారణాన్ని కూడా ఆ యజమాని వెల్లడించాడు. తన ఇంటిని వేగంగా, నాణ్యంగా, శ్రద్ధగా కట్టారని, కాంట్రాక్టర్ పని విధానం నచ్చి తాను ఈ బహుమతి ఇవ్వాలని నిర్ణయించినట్లు బిల్డింగ్ యజమాని తెలిపారు. పంజాబ్‌లోని జిరాక్‌పూర్ సమీపంలో.. బిజినెస్‌మెన్ గుర్దీప్ దేవ్‌బత్ ఒక విశాలమైన రాజభవనాన్ని నిర్మించాలని భావించాడు. ఇందుకోసం రాజిందర్ సింగ్ రూప్రా అనే కాంట్రాక్టర్‌ను సంప్రదించాడు. తనకు ఇష్టమైన ఇంటిని బాగా కట్టినందుకు రాజిందర్ సింగ్ రూప్రా.. గుర్దీప్ దేవ్‌బత్ కాంట్రాక్టర్ రాజిందర్ సింగ్ రూప్రాకు ఏదైనా బహుమతి ఇవ్వాలని నిర్ణయించాడు. అందులో భాగంగా అతనికి కోటి రూపాయల విలువైన రోలెక్స్ వాచ్‌ను బహుమతిగా ఇచ్చాడు. ఆ వాచ్ 18 క్యారెట్ల బంగారంతో తయారైన రోలెక్స్ ఓస్టర్ పెర్పెచ్యువల్ స్కై డ్వెల్లర్. అది బంగారంతో మెరిసిపోతుంది. ఈ వాచ్‌ను చూసిన రాజిందర్ సింగ్ రూప్రా చాలా సంతోషపడ్డాడు. ఈ వాచ్‌కు బలమైన బంగారు లింక్‌లతో తయారైన ఓస్టర్ బ్రాస్‌లెట్ ఉంది. అంతే కాకుండా అందులో షాంపైన్ రంగు డయల్ కూడా ఉంది.

ఈ భవనం పంజాబ్‌లోని జిరాక్‌పూర్ దగ్గర 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది. ఇది ఆధునిక కోటను పోలి ఉంటుంది. పంజాబ్‌లోని షాకోట్‌కు చెందిన రాజిందర్ సింగ్ రూప్రా ఈ కోటను 2 సంవత్సరాల్లో పూర్తిచేశారు. దానికి 200 మందికి పైగా కార్మికులు నిరంతరం పని చేశారు. ఈ భవనానికి వాస్తుశిల్పి రంజోద్ సింగ్ డిజైన్ చేశారు.

ఈ భవనానికి దృఢమైన సరిహద్దు గోడతో ప్రైవేటు కోటలా నిర్మించారు. ఈ రాజ భవనంలో పెద్ద హాల్‌లు, అందంగా అలంకరించిన తోటలు ఉన్నాయి. ఇంకా ప్రత్యేకమైన నిర్మాణ విశేషాలు కూడా ఉన్నాయి. ఈ విషయం సోషల్ మీడియాలో పాపులర్ అవుతూ, నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Loading