Andhra Pradesh

విశాఖపట్నంలో కొత్త రూల్.. 2025 నుండి ‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్’ నిషేధం

విశాఖపట్నం నగరంలో కొత్త నియమాలు జనవరి 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. నగరాన్ని ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు, గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (GVMC) కీలక నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ శ్రీ ఎం.ఎన్. హరేంద్ర ప్రసాద్ ప్రకారం, 2025 జనవరి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వినియోగంపై పూర్తి నిషేధం విధించబడుతుంది. ఈ నిషేధం అమలు అవుతుండగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయించేవారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

ఈ మార్పును ప్రజలకు సమయానికి తెలియజేయడానికి, 45 రోజుల పాటు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు GVMC ప్రకటించింది. ఈ కార్యక్రమాల్లో స్వయం సహాయ సంఘాలు, శానిటేషన్ సిబ్బంది పాల్గొని, ప్రతీ వార్డులో “సే నో టు ప్లాస్టిక్” అనే నినాదంతో ప్రజలను చైతన్యపరచనున్నారు.

విశాఖపట్నం ఇప్పటికే దేశంలో నాలుగో పరిశుభ్రతలో మారు కృషి చేసిన నగరంగా గుర్తింపు పొందింది. ఈ మార్పులతో నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పర్యావరణానుకూలంగా మార్చేందుకు మరో అడుగు ముందుకేసింది.

120 మైక్రాన్ల కంటే తక్కువ మందం కలిగిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ నిషేధం అమలులోకి రావడంతో, ప్రజలు పర్యావరణ స్నేహపూర్వక ప్రత్యామ్నాయాలను ఎంచుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్లాస్టిక్ ఉత్పత్తి, విక్రయాలు చేసేవారు కూడా ఈ మార్పులో భాగస్వాములు కావాలని, ప్లాస్టిక్‌ బదులుగా తార్పూలిన్, కాటన్ బ్యాగులు వంటి ఎకో ఫ్రెండ్లీ ప్రత్యామ్నాయాలు ఉపయోగించాలని కోరారు.

ఈ చర్యలు విజయవంతం అవ్వాలంటే ప్రతి ఒక్కరి సహకారం ఎంతో అవసరం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version