Latest Updates
BREAKING NEWS: సినీ నటుడు రాజేశ్ ఇకలేరు – 50 ఏళ్ల సినీ ప్రయాణానికి ముగింపు
ప్రఖ్యాత సినీ నటుడు రాజేశ్ (వయసు 75) తుదిశ్వాస విడిచారు. కొద్దిసేపటి క్రితం ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ పరిశ్రమను, అభిమానులను తీవ్ర విషాదంలోకి నెట్టింది.
తమిళనాడులోని మన్నారుగుడిలో జన్మించిన రాజేశ్, తన కెరీర్ను సీరియల్స్ ద్వారా ప్రారంభించి, తర్వాత సినిమాలకీ తన ప్రతిభను విస్తరించారు. సుమారు 50 ఏళ్లకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. మొదట హీరోగా ప్రేక్షకుల మన్ననలు పొందిన రాజేశ్, కాలక్రమేణా క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారారు. తన నటనలో వైవిధ్యం చూపిస్తూ దక్షిణ భారత సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు.
అయన 150కి పైగా సినిమాల్లో నటించారు. ముఖ్యంగా తమిళం, మలయాళ భాషల్లో ఆయన చేసిన పాత్రలు ప్రేక్షకుల మనసులను గొట్టాయి. తెలుగులోనూ కొన్ని ప్రముఖ చిత్రాల్లో నటించారు. బంగారు చిలుక, చాదస్తపు మొగుడు, మా ఇంటి మహారాజు వంటి చిత్రాల్లో ఆయన కనిపించి తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు పొందారు.
రాజేశ్ మృతితో తెలుగు, తమిళ, మలయాళ సినీ పరిశ్రమలో దిగ్భ్రాంతి నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ‘‘ఒక గొప్ప నటుడు, మంచివ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని కోల్పోయాం. ఆయన చేసిన సినిమాలు శాశ్వతంగా మనలో ఉండిపోతాయి,’’ అని పలువురు దర్శకులు, సహనటులు భావోద్వేగంగా స్పందించారు.
పరిమిత వనరులతో కెరీర్ ప్రారంభించినా, అంకితభావం, నైపుణ్యం ద్వారా రాజేశ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మరణం దక్షిణాది సినీ ప్రపంచానికి తీరని లోటు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు సినీ ప్రముఖులు సానుభూతి తెలిపారు.
రాజేశ్ అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయని కుటుంబ సభ్యులు వెల్లడించారు.