Andhra Pradesh
BREAKING: రాష్ట్రంలో కరోనా కేసు
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో కరోనా కేసు కలకలం రేపింది. మద్దిలపాలెం ప్రాంతానికి చెందిన ఒక వివాహితకు కరోనా సోకినట్లు అధికారులు నిర్ధారించారు. ఆమెతో పాటు ఆమె భర్త మరియు పిల్లలకు వైద్యులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం వారు వైద్యుల సూచనల మేరకు వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించారు.
ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. అయితే, కరోనా వ్యాప్తి నివారణ కోసం అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు కోరారు. ప్రభుత్వం మరియు ఆరోగ్య శాఖ కరోనా నియంత్రణకు అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.