Andhra Pradesh
విశాఖపట్నం అర్బన్‌ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు

విశాఖపట్నం అర్బన్‌ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు
విశాఖపట్నంకు అరుదైన జియో పార్క్ హోదా దక్కే అవకాశం కనిపిస్తోంది. దేశంలో ఆరు ప్రాంతాలను జీఎస్ఐ గుర్తించింది.. ఇందులో విశాఖపట్నంకు చోటు దక్కింది. ఢిల్లీలో జరిగిన సదస్సులో చర్చలు జరగాగ .. దేశంలో ఆరు ప్రదేశాలను షార్ట్ లిస్ట్ చేశారు. త్వరలో యునెస్కోకు ప్రతిపాదనలు పంపనున్నారు. విశాఖపట్నం లో బౌద్ధారామాలు, బొర్రా గుహలు, ఎర్రమట్టి దిబ్బలు, తూర్పు కనుమలకు చరిత్ర, ఉంది. అందువల్ల విశాఖపట్నంకు జియో గుర్తింపు వస్తే భారీ ప్రయోజనాలు చేకూరనున్నాయి.
విశాఖపట్నంకు మరో అరుదైను గుర్తింపు లభించే అవకాశం ఉంది. యునెస్కో ప్రపంచ వ్యాప్తంగా 48 దేశాల్లోని 200 ప్రాంతాలను జియో పార్కులుగా గుర్తించగా.. విశాఖకు కూడా ఆ గుర్తింపు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మన దేశంలోని ఆరు ప్రదేశాలను గుర్తించగా.. వాటిలో సిక్కిం మామెలిలో పోషిల్ పార్కు, రాజస్థాన్‌లో రామగర్ జియోపార్కు, జబల్పూర్ జియోపార్కు కేరళ వరకల జియోపార్కు, విశాఖపట్నం అర్బన్ జియో పార్కులు రాజస్థాన్‌లో రామగర్ జియోపార్కు, లద్దాఖ్‌లో లామయూరు మ్యూజియం, ఉన్నాయి. ఈ మధ్య ఢిల్లీలో యునెస్కో నిర్వహించిన సదస్సులో – జీఎస్ఐ సంయుక్తంగా జియో పార్కుల అంశంపైనా చర్చ జరిగింది. ప్రతి ఏటా యునెస్కో ఒక దేశా౦ లోని రెండు ప్రదేశాలకు మాత్రమే గుర్తింపు ఇస్తుంది.
విశాఖపట్నంను జియోపార్కుగా గుర్తించాలంటే యునెస్కో నిర్దేశించిన మోడల్ సమర్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎర్రమట్టిదిబ్బలను భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించేందుకు ఇంటాక్ సంస్థ కృషి చేసింది. వీరు జీఎస్ఐతో పోరాడి గుర్తింపు తీసుకువచ్చారు. ఎర్రమట్టి దిబ్బలతో పాటుగా విశాఖపట్నం పరిసరాల్లో మరికొన్ని పురాతన ప్రదేశాలను ప్రపంచానికి చాటి చెప్పాలని ఇంటాక్ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో ఇటీవల ఢిల్లీలో జరిగిన జియోపార్కులపై నివేదిక కూడా సమర్పించారు.
ఢిల్లీలో జరిగిన సమావేశంలో.. నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ సంస్థ మన దేశం నుంచి ప్రతిపాదించిన ఆరు ప్రదేశాలలో విశాఖకు వేల ఏళ్ల చరిత్ర ఉందని ప్రతిపాదించింది. విశాఖకు జియోపార్కుగా గుర్తింపు లభిస్తే పర్యాటకపరంగా ఎంతో ఉపయోగంగా ఉంటుందని చెబుతున్నారు. ఒక అథారిటీ ఏర్పాటుచేసి కార్యకలాపాల నిర్వహణకు వీలుంటుంది అంటున్నారు. అక్కడి ప్రముఖ స్థలాలను ఒకే గొడుగు తీసుకొచ్చి.. విశాఖపట్నం ఎన్నో ఏళ్లకు చరిత్ర కలిగిన భౌగోళిక వైవిధ్యం ఉన్న ప్రాంతం అంటున్నారు. అక్కటి ఎర్రమట్టిదిబ్బలు, బొర్రా గుహలు, ఎర్రమట్టిదిబ్బలు, బొజ్జన్నకొండ బౌద్ధారామాలైన తొట్లకొండ,బావికొండ, బొజ్జన్నకొండ వంటి పర్యాటక ప్రదేశాలకు కూడా ఎంతో చరిత్ర ఉంది.
ఇక విశాఖ సముద్ర తీరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విశాఖపట్నం భీమిలి సమీపంలో ఎర్రమట్టి దిబ్బలకు ఘన చరిత్ర ఉండగా బొర్రాగుహలకు వేల ఏళ్ల చరిత్ర ఉంది.. .. ఈ స్థలాన్ని భౌగోళిక వారసత్వ సంపదగా జియోజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. సింహాచలం దేవాలయం, పాత నగరంలో వారసత్వ కట్టడాలు ఉన్నాయి.
విశాఖపట్నం అర్బన్‌ను జియోపార్కుగా యునెస్కో గుర్తిస్తే ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కుతుందంటున్నారు. అప్పుడు విశాఖపట్నంకు ఇతర దేశాల నుంచి ఎక్కువమంది పర్యాటకులు వస్తారని.. అప్పుడు ఈ ప్రాంతం భౌగోళిక వారసత్వ సంపద, పురావస్తు చరిత్ర, విశిష్టతకు ప్రాచుర్యం లభిస్తుంది అంటున్నారు. అప్పుడు పెద్దఎత్తున ఉపాధితో పాటు ఆర్థిక కార్యకలాపాలు జరుగుతాయనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రస్థాయిలో విశాఖ నగరానికి స్వచ్ఛబాగీదారి అవార్డు దక్కంది.