Entertainment
హీరో అఖిల్ పెళ్లి.. అయితే కాబోయే మామగారు వైసీపీ ప్రభుత్వంలో వ్యక్తా?

సినీ నటుడు అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు, హీరో అఖిల్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అది కూడా ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. ఈ మధ్యనే ఆయన నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈ విషయాన్ని నాగార్జున ఒక సర్ప్రైజింగ్ న్యూస్‌గా వెల్లడించారు. అక్కినేని అఖిల్, జైనబ్ రావ్జీ నిశ్చితార్థం ఫోటోలను నాగార్జున తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. జైనబ్ రావ్జీ, అఖిల్ కోడలు కాబోతున్నారని ఆయన ప్రకటించారు.
ఇక పోతే అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహం డిసెంబరు 4న జరగబోతుంది. ఈ వివాహం కోసం ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో అక్కినేని ఇంట మరో శుభకార్యం జరగడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోతున్నారు. అలాగే, జైనబ్ రావ్జీ గురించి తెలుసుకునేందుకు ఆమె కుటుంబ నేపథ్యం గురించి ఎక్కువగా వెతుకుతున్నారు.
జైనబ్ రావ్జీ ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రావ్జీ కుమార్తె. జుల్ఫీ రావ్జీ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా కీలకపాత్ర పోషించారు. ఆయన కేబినెట్ మంత్రులతో సమానమైన స్థాయిలో పని చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ కంట్రీస్‌లో స్పెషల్ రిప్రజెంటేటివ్‌గా ఆయన పనిచేశారు. ఈ సమయంలో ఆయన మంత్రులతో సమానమైన సౌకర్యాలు పొందారు, అవి కార్లు, ల్యాప్‌టాప్, ఫర్నీచర్, మెడికల్ రీయింబర్స్మెంట్, ప్రైవేట్ సెక్రటరీ, ఇద్దరు డ్రైవర్లు, మూడు మొబైల్ ఫోన్లు, ఇతర సౌకర్యాలు.
మిడిల్ ఈస్ట్, ఫార్ ఈస్ట్ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో జుల్ఫీ రావ్జీ కీలక పాత్ర పోషించారు. ఆయన కుమారుడు జైన్ రావ్జీ కూడా ఒక వ్యాపారవేత్తగా, జేఆర్ రినేవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌కు చైర్మన్, ఎండీగా ఉన్నారు. ఈ కుటుంబం హైదరాబాద్‌లో నివసిస్తుంది.
జైనబ్ రావ్జీ ఒక ఆర్టిస్ట్‌గా పేరు పొందారు. ఆమె ఇండియా, దుబాయ్, లండన్ వంటి నగరాల్లో ఎక్కువగా ఉంటారని సమాచారం. అఖిల్, జైనబ్ రావ్జీ రెండు సంవత్సరాల కిందట మొదటిసారి కలిశారు. ఒకరి అభిప్రాయాలు మరొకరికి నచ్చడంతో ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఆ ప్రేమను పెళ్లిలో మార్చుకునేందుకు సిద్ధమయ్యారు.