Entertainment
సెప్టెంబర్ చివర్లో ప్రారంభం కానున్న ‘స్పిరిట్’ షూటింగ్: సందీప్ వంగా ప్రకటన
పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తున్న ‘స్పిరిట్’ సినిమా సెప్టెంబర్ చివరి వారంలో షూటింగ్ ప్రారంభం కానుందని దర్శకుడు సందీప్ వంగా తెలిపారు. ఇటీవల ఆయన తన పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ, ఈ సినిమా షూటింగ్‌ను నాన్‌స్టాప్‌గా కొనసాగించి త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఉన్నామని వెల్లడించారు.
‘కింగ్డమ్’ చిత్ర ప్రమోషన్స్ కోసం నటుడు విజయ్ దేవరకొండ, దర్శకుడు గౌతమ్ తన్ను పాడ్‌కాస్ట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమాలకు సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కలెక్షన్లు ప్రభావితం అవుతాయని, అందువల్ల U లేదా U/A సర్టిఫికెట్ రావడం మంచిదని అభిప్రాయపడ్డారు.