Connect with us

Education

ముగ్గురి DNAలతో జననం సాధ్యం..! బ్రిటన్‌లో వినూత్న వైద్య విజ్ఞానం

Britain's first three-parent baby is born: Procedure 'marks biggest leap  forward' since IVF created | Daily Mail Online

ముగ్గురి డీఎన్ఏలతో పిండం సృష్టించే పద్ధతిని బ్రిటన్ దశాబ్దం క్రితమే చట్టబద్ధం చేసింది. ఈ ‘మైటోకాండ్రియల్ డొనేషన్’ టెక్నాలజీ ద్వారా న్యూకాసల్‌కి చెందిన శాస్త్రవేత్తలు ఇప్పటికే 8 మంది పిల్లలకు జీవం నూరిపోశారు. ఇందులో పిల్లలకు తల్లి, తండ్రి, మరియు మూడవ వ్యక్తి అయిన అండదాత నుంచి డీఎన్ఏ అందుతుంది. ఇందులో తల్లిదండ్రుల నుంచి న్యూక్లియర్ డీఎన్ఏ తీసుకోగా, మూడవ వ్యక్తి నుంచి మైటోకాండ్రియల్ డీఎన్ఏ తీసుకుంటారు. ఇలా ఒక కలిపిన పిండాన్ని సృష్టించి, గర్భాశయంలో ప్రవేశపెడతారు.

ఈ పద్ధతిని ప్రధానంగా తల్లుల్లో (genetic) మైటోకాండ్రియల్ రుగ్మతలు ఉన్నప్పుడు ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల రోగాలను సంతానానికి సంక్రమించకుండా నిరోధించవచ్చు. అయితే, ఈ ప్రక్రియపై శాస్త్రీయ వర్గాలు, మానవ హక్కుల కార్యకర్తల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మానవ జన్యుపరమైన నిర్మాణంలో మార్పులు చేయడం నైతికంగా సరైనదేనా అన్న చర్చ కొనసాగుతోంది. అయినప్పటికీ, ఈ టెక్నాలజీ దాదాపు 0.1% డీఎన్ఏ మాత్రమే మూడవ వ్యక్తి నుంచే వస్తుందని, దీని ప్రభావం పిల్లల వ్యక్తిత్వంపై ఉండదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *