International
పాక్ యాత్రకు నో: మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా SGPC కీలక నిర్ణయం
సిక్కు సామ్రాజ్య వ్యవస్థాపకుడు మహారాజా రంజిత్ సింగ్ వర్ధంతి సందర్భంగా పాకిస్థాన్‌కు ఎలాంటి యాత్రలు నిర్వహించకూడదని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (SGPC) స్పష్టం చేసింది. ఈనెల జూన్ 29న జరిగే వర్ధంతికి ఏ ఒక్క సిక్కు యాత్రికుడిని పాక్ పంపించబోమని కమిటీ ప్రకటించింది.
ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ వర్గాలు వెల్లడించాయి. పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్ ప్రాంతాల్లో ఉన్న గురుద్వారాలు, సిక్కు మతపరమైన ప్రదేశాల నిర్వహణను SGPC పర్యవేక్షిస్తుంది. భక్తులు తమ రాష్ట్రాల్లోనే కార్యక్రమాలను నిర్వహించాలంటూ సూచనలు ఇవ్వబడ్డాయి.