Entertainment
ప్రముఖ హిందీ టీవీ నటుడు విభు రాఘవే కన్నుమూత
ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు విభు రాఘవే (వైభవ్ కుమార్ సింగ్) కన్నుమూశారు. కొంతకాలంగా స్టేజ్-4 పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
విభు రాఘవే ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ టీవీ సీరియల్‌తో ప్రేక్షకుల్లో విశేష ప్రజాదరణ పొందారు. అలాగే, ‘సావధాన్ ఇండియా’ షోలో కూడా ఆయన తన నటనతో మెప్పించారు. టెలివిజన్‌తో పాటు ‘యాద్వి-ది డిగ్నిఫైడ్ ప్రిన్సెస్’, ‘పిచ్ఫోర్క్’ వంటి చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం హిందీ టెలివిజన్ రంగంలో విషాదాన్ని నింపింది.