Entertainment

ప్రముఖ హిందీ టీవీ నటుడు విభు రాఘవే కన్నుమూత

Nisha Aur Uske Cousins' fame Vibhu Raghave passes away after prolonged  battle with Colon Cancer

ప్రముఖ హిందీ టెలివిజన్ నటుడు విభు రాఘవే (వైభవ్ కుమార్ సింగ్) కన్నుమూశారు. కొంతకాలంగా స్టేజ్-4 పెద్దపేగు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన, ముంబైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

విభు రాఘవే ‘నిషా ఔర్ ఉస్కే కజిన్స్’ టీవీ సీరియల్‌తో ప్రేక్షకుల్లో విశేష ప్రజాదరణ పొందారు. అలాగే, ‘సావధాన్ ఇండియా’ షోలో కూడా ఆయన తన నటనతో మెప్పించారు. టెలివిజన్‌తో పాటు ‘యాద్వి-ది డిగ్నిఫైడ్ ప్రిన్సెస్’, ‘పిచ్ఫోర్క్’ వంటి చిత్రాల్లోనూ నటించి తన ప్రతిభను చాటుకున్నారు. ఆయన మరణం హిందీ టెలివిజన్ రంగంలో విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version