Connect with us

Latest Updates

ఢిల్లీ పేరు మారుతుందా?: ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని అమిత్ షాకు ఎంపీ లేఖ!

#ఢిల్లీపేరుమార్పు #ఇంద్రప్రస్థ #అమిత్షా #బీజేపీ #ప్రవీణ్ఖండేల్వాల్ #భారతదేశం #రాజధాని #మహాభారతం #ఢిల్లీరాజకీయాలు #సంస్కృతి #బ్రేకింగ్న్యూస్ #చారిత్రకవారసత్వం

చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక ఆసక్తికరమైన ప్రతిపాదన పంపారు. దేశ రాజధాని ఢిల్లీ పేరును ‘ఇంద్రప్రస్థ’గా మార్చాలని ఆయన కోరారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన మూలాలను గౌరవించే క్రమంలో ఈ మార్పు అత్యవసరమని ఆయన పేర్కొన్నారు.

 మహాభారత కాలంలో పాండవులు నిర్మించిన వైభవోపేతమైన నగరం ‘ఇంద్రప్రస్థం’ అని, అదే నేటి ఢిల్లీ అని ఖండేల్వాల్ గుర్తు చేశారు. ఢిల్లీ అనే పేరు మధ్యయుగ కాలంలో వచ్చిందని, అది మన అసలైన నాగరికతను ప్రతిబింబించదని ఆయన వాదించారు,కేవలం పేరు మార్పు మాత్రమే కాకుండా, ఢిల్లీలోని చారిత్రక పురాణ ఖిల్లా వద్ద పాండవుల విగ్రహాలను ప్రతిష్టించాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా భావి తరాలకు మన వారసత్వం తెలుస్తుందని అభిప్రాయపడ్డారు,ఈ పేరు మార్పు ప్రతిపాదనపై ఢిల్లీ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను కూడా ఆయన కోరారు.ఇప్పటికే అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, గురుగావ్‌ను గురుగ్రామ్‌గా మార్చిన కేంద్ర ప్రభుత్వం.. ఇప్పుడు దేశ రాజధాని విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రతిపాదనపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *