Connect with us

india news

91 ఏళ్ల కల సాకారం..రంజీ ట్రోఫీ విజేతగా జమ్మూ కశ్మీర్: కర్ణాటకపై చారిత్రాత్మక విజయం!

#రంజీట్రోఫీ2026 #జమ్మూకశ్మీర్క్రికెట్ #చారిత్రకవిజయం #కశ్మీర్ఛాంపియన్స్ #దేశీయక్రికెట్ #పరాస్డోగ్రా #కర్ణాటకVsజమ్మూకశ్మీర్ #క్రికెట్వార్తలు #రంజీవిజేత #కమ్రాన్ఇక్బాల్ #ఆకిబ్నబీ #భారతక్రికెట్

భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘట్టం చోటుచేసుకుంది. బలమైన కర్ణాటక జట్టును చిత్తు చేసిన జమ్మూ కశ్మీర్, తొలిసారి రంజీ ట్రోఫీ ఛాంపియన్‌గా అవతరించింది. అనేక సామాజిక, రాజకీయ సవాళ్లను అధిగమించి ఆ జట్టు సాధించిన ఈ విజయం క్రీడా లోకాన్ని విస్మయానికి గురిచేస్తోంది.

తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 291 పరుగుల ఆధిక్యాన్ని సాధించిన జమ్మూ కశ్మీర్, మ్యాచ్‌పై పట్టు బిగించింది.బ్యాటర్ల విన్యాసం,రెండో ఇన్నింగ్స్‌లో కమ్రాన్ ఇక్బాల్ (160 నాటౌట్), సాహిల్ లోత్రా (101) శతకాలతో విరుచుకుపడటంతో కర్ణాటక ఆశలు గల్లంతయ్యాయి,ఈ సీజన్ అంతటా ఆకిబ్ నబీ తన బౌలింగ్‌తో ప్రత్యర్థులను వణికించాడు. నాకౌట్ దశలో నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, 24 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ ఉన్న పరాస్ డోగ్రా సారథ్యంలో జట్టు సమష్టిగా రాణించి కిరీటాన్ని ముద్దాడింది.

ఈ టోర్నీలో జమ్మూ కశ్మీర్ ప్రయాణం సామాన్యంగా సాగలేదు. ముంబై, ఢిల్లీ, బెంగాల్, మధ్యప్రదేశ్ వంటి దిగ్గజ జట్లను ఓడిస్తూ ఫైనల్‌కు చేరిన తీరు ఆ జట్టు పట్టుదలకు నిదర్శనం. కర్ణాటక కెప్టెన్ మయాంక్ అగర్వాల్ పోరాడినప్పటికీ, జమ్మూ కశ్మీర్ ఆల్‌రౌండ్ ప్రదర్శన ముందు అది సరిపోలేదు.ఈ విజయంతో కశ్మీర్ లోయలో సంబరాలు అంబరాన్నంటాయి. దేశీయ క్రికెట్‌లో ఒక చిన్న జట్టుగా పరిగణించబడే స్థాయి నుండి, దేశంలోనే నంబర్ 1 జట్టుగా ఎదిగి జమ్మూ కశ్మీర్ సరికొత్త రికార్డు సృష్టించింది.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *