Latest Updates
హైదరాబాద్లో జర్నలిజం, జ్యోతిషం, యోగా కోర్సులకు నోటిఫికేషన్
హైదరాబాద్లోని సురవరం ప్రతాపరెడ్డి (తెలుగు) యూనివర్సిటీ 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి రెగ్యులర్ కోర్సుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో జర్నలిజం, జ్యోతిషం, యోగా, భాషాశాస్త్రం, తెలుగు, జానపదం, సంగీతం, రంగస్థలం, ఫైన్ ఆర్ట్స్ వంటి విభిన్న సర్టిఫికెట్ ప్రోగ్రామ్లు అందుబాటులో ఉన్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ హనుమంతరావు తెలిపారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 24, 2025 వరకు సాధారణ ఫీజు చెల్లించి ఈ కోర్సులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. ఈ కోర్సులు విద్యార్థులకు వృత్తిపరమైన నైపుణ్యాలతో పాటు సాంస్కృతిక, సాంప్రదాయ జ్ఞానాన్ని అందించేలా రూపొందించబడ్డాయని రిజిస్ట్రార్ వివరించారు. దరఖాస్తు ప్రక్రియ మరియు కోర్సుల గురించి మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.