National
హనీమూన్ మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి
హనీమూన్ మర్డర్ కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతూ సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో తాజాగా మరో షాకింగ్ విషయం బయటపడింది. సోనమ్ తన భర్త రాజా రఘువంశీని చంపేందుకు గతంలో మూడుసార్లు విఫల ప్రయత్నాలు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి (SP) సయీమ్ వెల్లడించారు.
SP సయీమ్ ప్రకారం, సోనమ్ మొదటిసారి గువాహటిలో రాజాను చంపేందుకు ప్రయత్నించగా, ఆ తర్వాత మేఘాలయలోని సోహ్రా ప్రాంతంలో రెండుసార్లు మరోసారి హత్యాయత్నం చేసినట్లు తెలిపారు. అయితే, ఈ మూడు ప్రయత్నాలు విఫలమవ్వడంతో, సావ్ంగ్లో నాలుగోసారి జరిగిన దాడిలో రాజా రఘువంశీ దారుణ హత్యకు గురయ్యాడని అధికారులు పేర్కొన్నారు.
ఈ కేసులో ప్రధాన నిందితురాలైన సోనమ్‌తో పాటు, ఆమె ప్రియుడు రాజ్ కుశ్వాహా, మరో ముగ్గురు వ్యక్తులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ హత్య వెనుక ఉన్న కారణాలు, నిందితుల మధ్య సంబంధాలు, మరిన్ని వివరాలను కనుగొనేందుకు పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు గురించి మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి.