Andhra Pradesh
రూ.39,473 కోట్ల పెట్టుబడులకు సీఎం ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. రాష్ట్రాభివృద్ధిని ముందుంచుతూ భారీ స్థాయిలో ప్రాజెక్టులుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సీఎం చంద్రబాబు తాజాగా మరో రూ.39,473 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ఆమోదాలు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ (SIPB) సమావేశంలో పొందాయి. తాజాగా జరిగిన SIPB సమావేశంలో మొత్తం 22 ప్రాజెక్టులు ఆమోదం పొందగా, వీటి ద్వారా రాష్ట్రంలో దాదాపు 30,899 నూతన ఉద్యోగాల కల్పన జరగనుంది. ఇది పరిశ్రమల ప్రోత్సాహానికి, యువతకు ఉపాధి కల్పనకు అద్భుత ఉదాహరణగా నిలుస్తోంది.
ఈ 22 ప్రాజెక్టులు వివిధ రంగాలకు చెందినవిగా ఉండడం విశేషం. ముఖ్యంగా ఐటీ (సాఫ్ట్‌వేర్ & హార్డ్‌వేర్), ఫుడ్ ప్రాసెసింగ్, ఎనర్జీ (పునరుత్పాదక శక్తి ప్రాజెక్టులు), మరియు టూరిజం రంగాల్లో పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. ఇది రాష్ట్ర పునర్నిర్మాణంలో పారిశ్రామిక రంగానికి ఇచ్చిన ప్రాధాన్యతను స్పష్టంగా చూపుతోంది. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావడం ద్వారా పలు జిల్లాల్లో వృద్ధి, అభివృద్ధికి మార్గం ఏర్పడనుంది.
ఇప్పటివరకు చంద్రబాబు ప్రభుత్వంలో 8 SIPB సమావేశాలు జరగగా, మొత్తం రూ.5,74,238 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 109 ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సంఖ్య చూస్తేనే చంద్రబాబు ప్రభుత్వం పెట్టుబడులకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో అర్థమవుతోంది. ఇది రాష్ట్రానికి పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రభుత్వ పరిపాలనలో నిబద్ధతను స్పష్టంగా తెలియజేస్తోంది.