Latest Updates
రూ.3,000 చెల్లిస్తే దేశవ్యాప్తంగా 200 ట్రిప్పులు – హైవే యాత్రలకు కేంద్రం పాస్
జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయివేట్ వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్లు, జీపుల వంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యేకంగా ఫాస్టాగ్ బేస్డ్ యాన్యువల్ పాస్‌ను ప్రవేశపెడుతున్నట్టు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
ఈ పాస్‌కు రూ.3,000 చెల్లిస్తే, ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారిపై అయినా 200 ట్రిప్పులు జరుపుకోవచ్చు. ఈ కొత్త విధానం 2025 ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానుంది. పాస్ తీసుకోవడానికి Rajmarg Yatra App ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని గడ్కరీ వివరించారు. ఇది టోల్ చార్జీల భారం తగ్గించడంలో వినియోగదారులకు ఉపశమనం కలిగించనుంది.