Environment
రాష్ట్రంలో భారీ వర్షాలపై కేసీఆర్ స్పందన
తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆందోళన వ్యక్తం చేశారు. పలు జిల్లాల్లో నిత్యజీవన విధానమే స్తంభించిపోయే పరిస్థితి ఏర్పడటంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇళ్లు మునిగిపోవడం, రవాణా వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడం వల్ల ప్రజలు కష్టాలను అనుభవిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న BRS నేతలతో కేసీఆర్ ఫోన్ ద్వారా మాట్లాడారు. అక్కడి పరిస్థితులు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వ సహాయక చర్యలపై ప్రత్యక్ష సమాచారాన్ని తెలుసుకున్నారు. స్థానిక నాయకులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి, తక్షణ సహాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆయన వారికి సూచించారు.
అదే విధంగా పార్టీ శ్రేణులు, ముఖ్యంగా KTR సహా అన్ని నాయకులు సహాయక చర్యల్లో సక్రమంగా పాల్గొని, ప్రజలకు భరోసా కల్పించాలని కేసీఆర్ ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రజలతో కలిసి ఉండడం, అవసరమైన చోట సహాయం అందించడం ప్రతీ నాయకుడి బాధ్యత అని కేసీఆర్ స్పష్టం చేశారు.