Environment
రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.
రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. నేటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు తెలంగాణలో విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వానలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.
జిల్లాల వారీగా వర్ష సూచనలు
ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. రైతులు, గ్రామీణ ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ప్రజలు జాగ్రత్తగా ఉండాలి
వర్షాలు కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు, చెట్లు కింద నిలబడకుండా ఉండాలని, వాహనదారులు జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారుల సూచన. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థలు ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ కోరింది. రైతులు పంటల విషయంలో తగిన చర్యలు చేపట్టాలని సూచించింది.