Latest Updates
రప్ప రప్ప’ రచ్చకు ప్రయత్నం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శలు
తెలంగాణ రాష్ట్రంలో ‘రప్ప రప్ప’ అంటూ రచ్చ సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గతంలో రెండు సార్లు ప్రజలను మోసం చేసిందని, ఇకపై రాష్ట్రంలో షో రాజకీయాలకు చోటు లేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పుడు అన్నీ రియల్‌గానే జరుగుతాయని, ప్రజలకు నిజాయతీతో సేవ చేసే పాలన అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
బనకచర్ల విషయంలో ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గబోదని మంత్రి దృఢంగా చెప్పారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రాష్ట్ర పురోగతికి అడ్డుపడే రాజకీయ కుట్రలను తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నామని పొంగులేటి వ్యాఖ్యానించారు.