Entertainment
మాదాపూర్: శిల్పకళా వేదిక వద్ద పవన్ అభిమానుల జోరు
మాదాపూర్ ప్రాంతమంతా పవన్ కళ్యాణ్ అభిమానుల ఉత్సాహంతో ఉరకలేస్తోంది. ‘హరిహర వీరమల్లు’ ప్రీరిలీజ్ ఈవెంట్కు పరిమిత పాసులు మాత్రమే అనుమతించడంతో, అనేక మంది ఫ్యాన్స్ రోడ్డుపైనే గుమిగూడారు. హైదరాబాద్ శిల్పకళావేదికలో ఈ వేడుక జరగనున్న నేపథ్యంలో పోలీసులు నియమించిన కఠిన నియమాలు అమలులో ఉన్నాయి. ఈ ఈవెంట్ సమయంలో ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినా, దాని పూర్తి బాధ్యత నిర్మాతలదే అని అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం కోసం 100 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.