Latest Updates
భద్రాద్రి కొత్తగూడెంలో ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గం బెండాలపాడు గ్రామాన్ని సందర్శించనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ‘ఇందిరమ్మ ఇళ్ల’ గృహప్రవేశ మహోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొనబోతున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
ప్రభుత్వం ఈ పథకం కింద ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేసింది. గిరిజన నియోజకవర్గాలు, ఐటీడీఏ ప్రాంతాలకు అదనంగా 1,000 ఇళ్లు కేటాయించడం ప్రత్యేకత. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు.