Latest Updates
బాసర, భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం
భారీ వర్షాల ప్రభావంతో గోదావరి ఆగ్రహంగా ఉప్పొంగుతోంది. బాసరలో హరిహర కాటేజీ పరిసరాలకు వరదనీరు చేరింది. అక్కడి మూడు లాడ్జిల్లో చిక్కుకున్న 15 మందిని SDRF సిబ్బంది రక్షించారు. ఇదిలా ఉండగా భద్రాచలంలో గోదావరి నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం నీటి మట్టం 40.7 అడుగులకు చేరగా, 15 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోంది. స్నాన ఘట్టాల వద్ద మెట్లు, విద్యుత్ స్తంభాలు పూర్తిగా నీట మునిగిపోయాయి.
Continue Reading