Business

బంగారం భగ్గు: యుద్ధ సెగతో ఒక్కరోజే రూ. 7 వేలు పెరిగిన ధర.. తులం బంగారం @ రూ. 1.68 లక్షలు!

ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యను ధ్రువీకరించడంతో పసిడి మార్కెట్‌లో మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఎగబాకాయి. కేవలం 24 గంటల వ్యవధిలోనే బంగారం ధర సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరుకుంది.పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో గ్లోబల్ మార్కెట్లు అతలాకుతలమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు నిర్వహించడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మళ్లారు. దీని ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు చుక్కలను తాకుతున్నాయి.

22 క్యారెట్ల బంగారం తులం (10 గ్రాములు) ధర రూ. 6,550 పెరిగి ఇప్పుడు రూ. 1,54,650 వద్దకు చేరింది.24 క్యారెట్ల బంగారం తులం ధర ఏకంగా రూ. 7,140 వృద్ధి చెంది రూ. 1,68,710 కి చేరుకుంది.సిల్వర్ రేటులో భారీ విస్ఫోటనం సంభవించింది. ఒక్కరోజులో రూ. 25,000 పెరిగి కిలో వెండి రూ. 3.20 లక్షల మార్కును తాకింది,యుద్ధం కారణంగా గంట గంటకూ ధరలు మారుతున్నాయి. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం..లలితా జువెల్లరీలో రూ. 15,465, తనిష్క్ లోరూ. 15,505ఖజానాలో రూ. 15,465 ధరలు.

ఇరాన్ అణ్వాయుధాలను నిర్మించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆరోపణలతో అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు భారీ దాడులకు దిగాయి. ఇరాన్‌ను ప్రపంచ ఉగ్రవాద కేంద్రంగా అభివర్ణించిన ట్రంప్, ఆ దేశాన్ని ఆర్థికంగా, సైనికంగా అణచివేస్తామని హెచ్చరించారు. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల వల్ల ముడి చమురుతో పాటు బంగారం డిమాండ్ విపరీతంగా పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version