Business
బంగారం ధరలు భారీగా తగ్గుదల – వెండి కాస్త పెరిగింది
బంగారం ధరలు వరుసగా రెండో రోజు తగ్గుతుండటంతో వినియోగదారులకు ఊరట లభించింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,140 తగ్గి ₹1,00,370కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు ₹1,050 తగ్గి ₹92,000 వద్ద కొనసాగుతోంది.
మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా పెరిగింది. ఒక కేజీ వెండి ధర ₹100 పెరిగి ₹1,20,000కి చేరినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఈ ధరలు సుమారుగా ఒకేలా నమోదవుతున్నాయి. పెళ్లిళ్లు, బంగారంపై పెట్టుబడి వేయాలనుకునే వినియోగదారులందరికీ ఇది అనుకూల సమయంగా మారే అవకాశముంది.
Continue Reading