Latest Updates
ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి అప్పగించాలి: బండి సంజయ్ డిమాండ్
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “నిందితులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు అనేకమందిని వేధించారు. వారి కారణంగా ఎన్నో కుటుంబాలు నష్టపోయాయి” అన్నారు.
రాధాకిషన్‌రావు స్టేట్మెంట్లో మాజీ సీఎం కేసీఆర్ పేరు వచ్చిందని గుర్తుచేశారు. అయినా ఆయనను ఎందుకు విచారించడంలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య కుట్రచేసి ఈ వ్యవహారాన్ని దాచిపెట్టే ప్రయత్నం జరుగుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కేసు నిష్పక్షపాతంగా జరిగేందుకు సీబీఐ విచారణ అవసరమని స్పష్టం చేశారు