Latest Updates
పుప్పాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు
నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రత్యక్షదర్శుల తెలిపిన వివరాల ప్రకారం… పుప్పాలగూడ ప్రధాన రహదారిపై వేగంగా వచ్చిన ఆటో ఒక బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి, ఇద్దరు చిన్నారులు రోడ్డుపై పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.