Connect with us

Education

న్యాయవ్యవస్థపై పాఠాలా?: ఎన్‌సీఈఆర్టీపై సుప్రీంకోర్టు ఫైర్.. ఆ పాఠం తొలగింపు!

#ఎన్‌సీఈఆర్టీ #సుప్రీంకోర్టు #న్యాయవ్యవస్థ #అవినీతిపాఠం #సిలబస్వివాదం #విద్యాశాఖ #కేంద్రప్రభుత్వం #బ్రేకింగ్న్యూస్ #తెలుగువార్తలు #కపిల్సిబల్ #పాఠ్యపుస్తకాలు #న్యాయవ్యవస్థప్రతిష్ఠ

పాఠశాల స్థాయి విద్యార్థులకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం పెంచాల్సింది పోయి, అందులోని అవినీతి గురించి పాఠాలు బోధించడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు.

న్యాయవ్యవస్థ ప్రతిష్ఠను దిగజార్చేలా పాఠ్యాంశాలు ఉండటాన్ని సహించబోమని సిజేఐ స్పష్టం చేశారు. అవసరమైతే దీనిపై సుమోటోగా విచారణ చేపడతామని హెచ్చరించారు,2025లో మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ పారదర్శకత గురించి చేసిన వ్యాఖ్యలను ఈ పాఠంలో తప్పుగా ఉటంకించడాన్ని కోర్టు తప్పుబట్టింది.రాజకీయ నాయకులు, మంత్రులు, దర్యాప్తు సంస్థల్లో ఉన్న అవినీతిని వదిలేసి, కేవలం న్యాయవ్యవస్థనే లక్ష్యంగా చేసుకోవడంపై సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వంటి వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.

కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్దిసేపటికే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 8వ తరగతి పాఠ్యపుస్తకం నుండి ‘న్యాయవ్యవస్థలో అవినీతి’ అనే భాగాన్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. విద్యార్థులకు స్ఫూర్తినిచ్చే అంశాలను బోధించాలి తప్ప, ఇలాంటి ప్రతికూల అంశాలను హైలైట్ చేయడం సముచితం కాదని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడ్డాయి,ఇటీవల న్యాయశాఖ విడుదల చేసిన నివేదికలో 2016-2025 మధ్య కాలంలో న్యాయమూర్తులపై 7,500కు పైగా ఫిర్యాదులు అందాయని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగానే ఎన్‌సీఈఆర్టీ ఈ పాఠాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, చిన్న వయసులోనే పిల్లలకు వ్యవస్థలపై అపనమ్మకం కలిగేలా ఇలాంటి పాఠాలు ఉండకూడదని న్యాయ నిపుణులు సిద్ధార్థ్ లూత్రా, అభిషేక్ మను సింఘ్వీ విమర్శించారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *