Latest Updates
నీరజ్ చోప్రాకు జనుస్ట్ కుసోసినికి మెమోరియల్ మీట్-2025లో రెండో స్థానం
పోలండ్‌లో జరిగిన ప్రతిష్ఠాత్మక జనుస్ట్ కుసోసినికి మెమోరియల్ మీట్-2025లో భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రెండో స్థానం సాధించారు. ఆరో రౌండ్లో తన జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరిన నీరజ్, ఈ పోటీలో రన్నరప్‌గా నిలిచారు. జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ 86.12 మీటర్లతో తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
ఇటీవల దోహా డైమండ్ లీగ్‌లోనూ ఇదే తరహా ఫలితం నమోదైంది. అక్కడ వెబర్ 91.06 మీటర్లతో మొదటి స్థానం దక్కించుకోగా, నీరజ్ 90.23 మీటర్లతో రెండో స్థానంలో నిలిచారు. నీరజ్ చోప్రా ఈ రెండు పోటీల్లో స్థిరమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ, వెబర్‌ను అధిగమించలేకపోయారు.
నీరజ్ ఈ సీజన్లో తన ఫామ్‌ను కొనసాగిస్తూ, భారత అథ్లెటిక్స్‌కు మరిన్ని విజయాలు అందించే దిశగా అడుగులు వేస్తున్నారు.