Andhra Pradesh
తెలుగు రాష్ట్రాల్లో ఓయో మెగా ప్లాన్: కొత్తగా 300 హోటళ్లు.. భద్రాద్రి, యాదాద్రిపై ప్రత్యేక ఫోకస్!
ఓయో మాతృసంస్థ ‘ప్రిజమ్’ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పర్యాటక రంగానికి ఉన్న డిమాండ్‌ను అందిపుచ్చుకునేందుకు సిద్ధమైంది. రానున్న రోజుల్లో కొత్తగా 300 సర్వీస్డ్ హోటల్స్ ఏర్పాటు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
తెలంగాణలోని ప్రముఖఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలైన యాదాద్రి, భద్రాచలంలలో వసతి సౌకర్యాలను మెరుగుపరచడానికి ఓయో ప్రాధాన్యత ఇస్తోంది,హైదరాబాద్‌తో పాటు వరంగల్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్ వంటి టైర్-2 నగరాలపై కూడా దృష్టి సారించింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నగరాల్లో ప్యాలెట్, సండే, టౌన్ హౌస్ వంటి ప్రీమియం బ్రాండ్ హోటళ్లను పెంచాలని భావిస్తోంది, పెరుగుతున్న వైద్య అవసరాలు, వ్యాపార కార్యకలాపాలకు అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న చోట్ల కొత్త హోటల్స్ రానున్నాయి.
ఐపీఓ దిశగా రితేశ్ అగర్వాల్ స్థాపించిన ఓయో సంస్థ, ఈ ఏడాదే స్టాక్ మార్కెట్‌లోకి (IPO) అడుగుపెట్టేందుకు కసరత్తు చేస్తోంది. సుమారు రూ. 6,650 కోట్ల నిధులను సేకరించడమే లక్ష్యంగా సెబీకి పత్రాలను సమర్పించింది. సరసమైన ధరలు, సులభమైన ఆన్‌లైన్ బుకింగ్ సౌకర్యంతో మధ్యతరగతి పర్యాటకులకు ఓయో ఇప్పటికే చేరువయ్యింది.
![]()
