Environment
తెలంగాణలో గంటలలోనే వర్ష సూచన – హైదరాబాద్ సహా 20 జిల్లాల్లో అలెర్ట్
తెలంగాణలో వాతావరణ మార్పులు కొనసాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మేఘాలు కమ్ముకున్నాయి. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రెండు గంటల వ్యవధిలో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు పడే సూచనలున్నాయి. దీనితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనవసరంగా బయటకి రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
హైదరాబాద్‌తో పాటు ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, గద్వాల జిల్లాల్లోని పలు మండలాల్లో వర్షాల ప్రభావం ఉండనుంది. ఈ ప్రాంతాల్లో గంటల వ్యవధిలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో జాగ్రత్తలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ, మునిసిపల్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. టాస్క్ ఫోర్స్ బృందాలు సిద్ధంగా ఉంచబడ్డాయి. రైతులు, ప్రయాణికులు, పాఠశాలలు, ట్రాఫిక్ పై ప్రభావం ఉండేలా వాతావరణం ఉండొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అధికార యంత్రాంగం నుంచి అప్డేట్స్ కోసం ప్రజలు అధికారిక వేదికల ద్వారా సమాచారం తెలుసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.