Andhra Pradesh
తిరుమలలో భక్తుల రద్దీ పెరుగుదల – సర్వదర్శనానికి 24 గంటల వేచిచూపు
తిరుమలలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. టోకెన్లు లేని భక్తులు శ్రీవారి సర్వదర్శనం కోసం సుమారు 24 గంటల పాటు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కంపార్టుమెంట్లు అన్నీ నిండిపోవడంతో శిలాతోరణం వరకు భక్తుల క్యూలైన్లు విస్తరించాయి.
నిన్న ఒక్కరోజే 76,181 మంది భక్తులు శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. అదే రోజు హుండీ ద్వారా రూ.4.88 కోట్లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. రద్దీ నేపథ్యంలో టీటీడీ భక్తులకు తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Continue Reading