Latest Updates
టీ20 వరల్డ్ కప్ 2026కు కెనడా అర్హత సాధిం
కెనడా క్రికెట్ జట్టు టీ20 వరల్డ్ కప్ 2026కు అర్హత సాధించింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ అమెరికాస్ రీజియన్ ఫైనల్ 2025లో బహమాస్‌పై విజయం సాధించి, కెనడా తమ వరల్డ్ కప్ టికెట్‌ను ఖరారు చేసుకుంది. కిర్టన్ సేన ఈ టోర్నమెంట్‌లో ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో అన్నింటిలోనూ గెలుపొంది అద్భుత ప్రదర్శన కనబరిచింది.
2026 టీ20 వరల్డ్ కప్‌కు ఇప్పటివరకు హోస్ట్ దేశాలైన భారతదేశం, శ్రీలంకతో పాటు దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఐర్లాండ్, పాకిస్థాన్, మరియు కెనడా అర్హత సాధించాయి. మరో ఏడు దేశాలు ఈ టోర్నమెంట్‌కు క్వాలిఫై కావాల్సి ఉంది. కెనడా ఈ అర్హతతో అంతర్జాతీయ క్రికెట్‌లో తమ సత్తా చాటడానికి సిద్ధంగా ఉంది.