Latest Updates
కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజమెత్తారు
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. “కాంగ్రెస్ వాళ్లది బిచ్చగాళ్ల బతుకులాంటిది” అంటూ ధ్వజమెత్తారు.
ఓట్ల కోసం ముస్లింల వద్దకు వెళ్లి టోపీలు పెట్టుకొని నమాజ్ చేసే వాళ్లమేమి కాదని స్పష్టం చేశారు. “నేను ఎంపీగా కేవలం హిందూ ఓటు బ్యాంక్ ద్వారానే గెలిచాను. దీనిపై గర్వంగా గల్లా ఎగిరేసి చెప్తున్నా” అని అన్నారు.
తెలంగాణ వ్యాప్తంగా హిందూ ఓటు బ్యాంక్‌ను బలపరుస్తామని బండి సంజయ్ ప్రకటించారు. రోహింగ్యాలు అంతా 2014 కంటే ముందే వచ్చారని కూడా వ్యాఖ్యానించారు.