Andhra Pradesh

ఏపీ మహిళలకు శుభవార్త.. రూ.2,000 ఖర్చు లేకుండా గ్యాస్ కనెక్షన్ ఉచితం

పేద మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా దారిద్య్రరేఖకు దిగువన ఉన్న మహిళలకు 2025–26 ఆర్థిక సంవత్సరం వరకు ఉచిత ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందజేస్తున్నారు.

ఇంటికి గ్యాస్ కనెక్షన్‌కు అవసరమయ్యే అన్ని ఖర్చులు కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలే తీసుకుంటాయి. గ్యాస్ సిలిండర్, రెగ్యులేటర్, పైపు, గ్యాస్ బుక్, ఇంట్లో బిగింపు ఖర్చులు అన్నీ కలిపి సుమారు రూ.2,050 విలువైన సదుపాయాలు పూర్తిగా ఉచితంగా అందుతాయి. ముఖ్యంగా మొదటి గ్యాస్ సిలిండర్‌ను ఎలాంటి చెల్లింపులు లేకుండ

గ్యాస్ కనెక్షన్ తీసుకున్న తరువాత, మరిన్ని సిలిండర్ల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం రూ.300 సబ్సిడీని నేరుగా అందిస్తుంది. దీనివల్ల వంటగ్యాస్ వినియోగం పేద కుటుంబాలకు మరింత సులభంగా మారుతుంది.

పథకం సమర్థవంతమైన అమలుకోసం ప్రతి జిల్లాలో జిల్లా ఉజ్వల కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి జిల్లా కలెక్టర్ ఛైర్మన్‌గా, ఆయిల్ కంపెనీ ప్రతినిధి జిల్లా కోఆర్డినేటర్‌గా, పౌర సరఫరాల శాఖ అధికారి సభ్యుడిగా ఉంటారు. ఈ కమిటీ పథకం అమలు నిరంతరం పరిశీలిస్తుంది.

అర్హత పరంగా రేషన్ కార్డు కలిగి ఉండి ఇంట్లో ఇప్పటికే గ్యాస్ కనెక్షన్ లేని మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. అవసరమైన పత్రాలు: ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు తప్పనిసరి. నెలకు రూ.10,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారు ఈ పథకానికి అర్హులు కారు. అవసరమైతే ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని రెవెన్యూ అధికారుల నుంచి పొందా

మైగ్రెంట్ వర్కింగ్ వుమన్ లు అవసరమైన పత్రాలు సమర్పించడం ద్వారా ఈ పథకాన్ని పొందవచ్చు. ఈ పథకానికి అర్హులైన మహిళలు సమీపంలోని గ్యాస్ ఏజెన్సీలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం కింద 14.2 కిలోల ఒక సిలిండర్ లేదా 5 కిలోల రెండు సిలిండర్లు పొందే అవకాశం ఉంది.

ఈ పథకం పేద మహిళలకు పొగరహిత వంటగదులు ఏర్పాటు చేయాలనే ధ్యేయంతో రూపొందింది. అందువల్ల ఆరోగ్యపరమైన, ఆర్థికపరమైన ప్రయోజనాలు లభిస్తాయి.

#PMUY#UjjwalaYojana#FreeGasConnection#APGovernment#WomenEmpowerment#PoorWomenWelfare
#LPGGasScheme#CentralGovernmentSchemes#AndhraPradeshNews#GasSubsidy#UjjwalaSchemeAP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version