ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) దేశవ్యాప్తంగా ఉన్న విభిన్న శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-B, గ్రూప్-C నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 3,501 పోస్టుల భర్తీకి ఈ ప్రకటన విడుదల కాగా, ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31, 2025 (రేపే) చివరి తేదీగా అప్లికేషన్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
ఈ నోటిఫికేషన్‌లో డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్, డ్రైవర్, క్యాషియర్, మెకానిక్ తదితర విభిన్న ఉద్యోగాలు ఉన్నాయి. అభ్యర్థులు తమ ఎంపిక చేసిన పోస్టును బట్టి సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి. టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, బీఫార్మసీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు వివిధ పోస్టులకు అర్హులు. అలాగే, వయస్సు 18 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrp.aiimsexams.ac.in ద్వారా ఆన్లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు. పరీక్ష తేది, అడ్మిట్ కార్డు విడుదల తేదీలు తదితర సమాచారం త్వరలోనే ప్రకటించనున్నారు. ఈ అవకాశాన్ని చేజార్చుకోకుండా తగిన అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేయాలని ఎయిమ్స్ సూచిస్తోంది.