International
ఇజ్రాయెల్‌పై మరోసారి విరుచుకుపడిన ఇరాన్: టెల్ అవీవ్ లక్ష్యంగా మిస్సైల్ దాడులు
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్న వేళ, ఇరాన్ మరోసారి ఇజ్రాయెల్‌పై మిస్సైళ్లతో విరుచుకుపడింది. టెల్ అవీవ్‌ను ప్రధాన లక్ష్యంగా తీసుకొని ప్రయోగించిన క్షిపణులతో నగరంలో సైరన్లు మోగాయి. ఈ దాడుల్లో జెరూసలేం, బీరెబా ప్రాంతాల్లోని పలు భవనాలు ధ్వంసమయ్యాయి.
తాజా దాడుల్లో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల సంఖ్య పదులలో ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు, ఇజ్రాయెల్ కూడా వెంటనే ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న నేపథ్యంలో, ఈ పరిణామాలు గ్లోబల్ స్థాయిలో ఆందోళన కలిగిస్తున్నాయి.