Connect with us

Health

ఆకలితో అల్లాడిన దేశానికి ‘స్వామి’ దిక్సూచి

Bharat Ratna for Prof M S Swaminathan | M S Swaminathan Research Foundation

భారత రత్న డాక్టర్ ఎమ్.ఎస్. స్వామినాథన్ – పేరు వినగానే “ఆకలిని జయించిన శాస్త్రవేత్త” అనే గుర్తింపు వెలుగు చూస్తుంది. గ్రీన్ రెవల్యూషన్ పితామహుడిగా ప్రసిద్ధి గాంచిన ఆయన, కేవలం ముప్పయ్యేళ్ళ వయసులోనే దేశ ఆహార భద్రతకు దిక్కు చూపారు.

అన్నం కోసం అరుస్తున్న కాలంలో… కరవు, ఆకలి, తినడానికి లేని దుస్థితుల్లో ఉన్న ప్రజలకు వెలుగు చూపిన మహానుభావుడు స్వామినాథన్. జపాన్, అమెరికా, మెక్సికో దేశాల శాస్త్రవేత్తలతో కలిసి ఆయన చేసిన పరిశోధనలు – వరి, గోధుమ వంగడాలపై చేసిన ప్రయోగాలు – దేశ ఆహార భద్రతకు బలమైన బాట వేసాయి.

ఆయన చూపిన మార్గంలో నడిచి భారత్‌ ఆహార ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధిగా మారింది. అప్పటి ఆకలిదే శత్రువు అయిన దేశం… ఈరోజు విదేశాలకు ధాన్యాన్ని ఎగుమతి చేసే స్థాయికి చేరింది.

ఈ మహోన్నత సేవలకు గుర్తుగా, MS స్వామినాథన్ జయంతి సందర్భంగా ఆయన కృషిని మరలా ఓసారి స్మరించుకుందాం.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *