Entertainment
అప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. నిర్మాతతో రహస్య పెళ్లి.. ఇప్పుడు నెట్టింట దుమారం
టాలీవుడ్ లో ఒక్కసారిగా మెరిసి తర్వాత కనిపించకపోయిన హీరోయిన్స్ సంఖ్య తక్కువేం కాదు. ఎవరో పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పేసారు.. ఇంకొంతమంది అంచనా వేయని విధంగా మాయమయ్యారు. ఆ జాబితాలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు.
హీరోయిన్గా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. అందం తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ప్రతిభ ఉన్నా, సరైన ఛాన్సులు రాకపోతే కెరీర్ ఆగిపోతుంది. టాలీవుడ్లో ఎన్నో భామలు ఒకప్పుడు తన నటనతో, అందంతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశారు. కానీ ఇప్పుడు వారిని తెరపై చూడలేం. కొందరు పూర్తిగా అదృశ్యమవ్వగా, ఇంకొంతమంది సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడు కనెక్ట్ అవుతున్నారు.
అందులో పైన కనిపిస్తున్న ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపింది. తన అమాయకపు స్మైల్‌తో యూత్‌ను ఫిదా చేసింది. సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ ఫొటోలతో గ్లామర్ డోస్ పెంచుతూ ఉంటుంది.
పూనమ్ బజ్వా కెరీర్ జర్నీ
నవదీప్ హీరోగా నటించిన సినిమాతో హీరోయిన్గా టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది పూనమ్ బజ్వా. ఆ తర్వాత ప్రేమంటే ఇంతే, నాగార్జున హీరోగా నటించిన బాస్ మూవీలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కనిపించింది. అలాగే అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమాలో హీరోయిన్ సిస్టర్‌గా నటించింది.
తర్వాత తమిళ్, కన్నడ, మలయాళ సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. తెలుగులో చివరిసారిగా బాలకృష్ణ ఎన్.టి.ఆర్ కథానాయకుడు సినిమాలో గారపాటి లోకేశ్వరి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత పెద్దగా ఛాన్సులు లేకపోవడంతో సోషల్ మీడియానే ప్లాట్‌ఫామ్‌గా మార్చుకుంది. గ్లామర్ ఫొటోలు, వీడియోలతో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కి దగ్గరగా ఉంటుంది.
నిర్మాతతో రహస్య వివాహం..?
ఇదిలా ఉండగా, ఓం 3D సినిమాను తెరకెక్కించిన దర్శకుడు సునీల్ రెడ్డితో పూనమ్ బజ్వా రహస్యంగా పెళ్లి చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. కానీ నెట్టింట మాత్రం పూనమ్ తాజా ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఆమె అందాల దాడితో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న ఈ భామ మళ్లీ సినిమాల్లోకి వస్తుందా అనే ఆసక్తి ఫ్యాన్స్‌లో మొదలైంది.