News
హైదరాబాద్: అంబారీపై ఘటాల ఊరేగింపు వైభవంగా ప్రారంభం
పాతబస్తీలోని శ్రీ అక్కన్న మాదన్న మహంకాళి దేవాలయం నుంచి ఘటాల ఊరేగింపు వేడుక అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. సంప్రదాయానికి అనుగుణంగా ఈ ఏడాది కూడా అమ్మవారి ఘటాలను అంబారీపై అలంకరించి, భక్తుల నడుమ ఊరేగింపు నిర్వహించారు. భారీగా భక్తులు తరలిరావడంతో పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Continue Reading