Entertainment
హరిహర వీరమల్లు షూటింగ్ షురూ..

Pawan Kalyan: ఆహా.. హరిహర వీరమల్లు షూటింగ్ షురూ.. రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది
పవన్ ఫ్యాన్స్‌కు కిక్కిచ్చే న్యూస్. హరిహర వీరమల్లు షూటింగ్ పున:ప్రారంభం అయింది. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు మేకర్స్. హైదరాబాద్- విజయవాడ షెటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్ చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. హరిహర వీరమల్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. వచ్చే ఏడాది మార్చి 28న మూవీ విడుదల కానుంది. ఇవాళ్టి నుంచి విజయవాడలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. విజయవాడలో ఇప్పటికే సెట్లు కూడా రెడీ చేశారు. ఇవాళ ఉదయం 7 గంటలకు లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టారు. డిప్యూటీ సీఎంగా అధికారిక కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు పవన్ కల్యాణ్.. అటు పాలనాపరమైన అంశాలు.. ఇటు సినిమాలు రెండూ బ్యాలెన్స్ చేయడం కష్టంగా మారిన పరిస్థితుల్లో.. పవన్ ఉంటున్న విజయవాడలోనే సినిమా కోసం సెట్లు రెడీ చేశారు. హైదరాబాద్- విజయవాడ షెటిల్ సర్వీస్ చేసే పని లేకుండా బెజవాడలోనే సినిమా షూటింగ్ చేయబోతున్నారు.