Andhra Pradesh
“యోగాంధ్ర సక్సెస్‌కి మోదీ శభాష్”
ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నంలో నిర్వహించిన ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’ విజయవంతమవడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంలో ముఖ్యపాత్ర పోషించిన రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ, “యోగాంధ్ర” కార్యక్రమం ద్వారా నెలరోజుల్లోనే యోగాను సామాజిక ఉత్సవంగా ఎలా మలచాలో, సమాజంలోని అన్ని వర్గాలను ఎలా ఏకతాటిపైకి తీసుకురావాలో ప్రదర్శించారని ప్రశంసించారు. లోకేశ్ చూపిన సామాజిక స్పృహ, నాయకత్వం ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుందని కొనియాడారు