Business
బెంగళూరులో ఐఫోన్ 17 ఉత్పత్తి ప్రారంభం
బెంగళూరు సమీపంలోని ఫాక్స్‌కాన్ ప్లాంట్‌లో ఐఫోన్ 17 స్మార్ట్ఫోన్ల ఉత్పత్తి అధికారికంగా ప్రారంభమైంది. ఇప్పటికే చెన్నై యూనిట్లో కూడా ఈ మోడల్ ప్రొడక్షన్ మొదలైనట్లు సమాచారం. యాపిల్ భాగస్వామ్యంతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు దేశీయ ఎలక్ట్రానిక్స్ తయారీలో కీలక మైలురాయిగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ ఏడాది మొత్తం 6 కోట్ల ఐఫోన్లను తయారు చేయాలని ఫాక్స్‌కాన్ లక్ష్యంగా పెట్టుకుంది. స్థానిక స్థాయిలో ప్రొడక్షన్ పెరగడం వలన భారత్‌లో ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాకుండా, ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి ఇది పెద్ద ఊతమివ్వనుంది.
దాదాపు 2.8 బిలియన్ డాలర్ల వ్యయంతో బెంగళూరు దగ్గరలోని దేవనహళ్లిలో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్, యాపిల్‌కు గ్లోబల్ సరఫరా కేంద్రంగా మారనుంది. కొత్త మోడల్ ఐఫోన్ 17ను సెప్టెంబర్‌లో మార్కెట్లోకి విడుదల చేయడానికి యాపిల్ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. దీంతో భారతదేశంలోనే తయారైన ఐఫోన్లు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా చేరనున్నాయి.