Latest Updates
ప్రమాదంలో జూరాల ప్రాజెక్టు – తెగిపోయిన గేట్ రోప్, భయాందోళనల్లో ప్రజలు
తెలంగాణలోని జూరాల ప్రాజెక్టు వద్ద భారీ వరదల ప్రభావంతో గేట్లు ప్రమాదంలో పడ్డాయి. వరద ఉధృతి భయానకంగా పెరగడంతో 9వ నంబర్ గేట్‌కు సంబంధించిన రోప్ తెగిపోయింది. ఈ ఘటనతో ప్రాజెక్టు భద్రతపై సందేహాలు నెలకొని, స్థానిక ప్రజల్లో భయాందోళనలు ఏర్పడ్డాయి.
ఇక 12, 14, 24, 26వ గేట్లు కూడా బలహీనంగా మారినట్టు సమాచారం. వీటికి కూడా ప్రమాదం తలెత్తే అవకాశముండటంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు గేట్ రోప్ తెగడంపై ప్రాజెక్టు అధికారులు అధికారికంగా స్పందించలేదు. త్వరితగతిన సమీక్ష నిర్వహించి, చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.