Latest Updates
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు: సీఎం రేవంత్ రెడ్డి షేర్ చేసిన ప్రత్యేక వీడియో
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రత్యేక వీడియోను సామాజిక మాధ్యమం Xలో షేర్ చేశారు. ఈ వీడియోలో రాష్ట్ర సాంస్కృతిక వైవిధ్యం, కళల సమ్మేళనం, జన జీవన చిత్రణలు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన పేర్కొన్నారు. “కళలా మంజీరాలు, సాంస్కృతిక వైవిధ్యాలు, కవి గాయక వైతాళికులకు సన్మానాలు, జన జీవన సంరంభ సన్నివేశాలు.. జనరంజక పాలనా సందేశాలు కలగలిసిన స్వరాష్ట్ర ఆవిర్భావ వేడుక” అంటూ సీఎం తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
నిన్న హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన ఆవిర్భావ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి, ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ వేడుకలు రాష్ట్ర ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రదర్శించే వేదికగా నిలిచాయి.