Connect with us

Education

టెన్త్ హాల్ టికెట్లు వచ్చేశాయి: వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోండిలా.. విద్యార్థులకు విద్యాశాఖ బిగ్ రిలీఫ్!

#తెలంగాణటెన్త్ #హాల్‌టికెట్లు #TS_SSC_Results #పదోతరగతిపరీక్షలు #వాట్సాప్_హాల్‌టికెట్ #విద్యాశాఖ #తెలంగాణవిద్యార్థులు #టెన్త్_పరీక్షలు #ఎగ్జామ్_అప్‌డేట్స్ #తెలంగాణవార్తలు #స్టూడెంట్స్_న్యూస్

తెలంగాణలో ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షల కోసం హాల్ టికెట్లను అధికారులు విడుదల చేశారు. ముఖ్యంగా ఫీజుల పేరుతో ప్రైవేట్ స్కూళ్లు హాల్ టికెట్లు ఆపకుండా ఉండేందుకు మరియు విద్యార్థుల ఇబ్బందులను తొలగించడానికి విద్యాశాఖ ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులు లేదా తల్లిదండ్రులు వాట్సాప్ ద్వారా ఈ స్టెప్స్ పాటించి నిమిషాల్లో హాల్ టికెట్ పొందవచ్చు:-ముందుగా మీ ఫోన్‌లో 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోండి.ఈ నంబర్‌కు వాట్సాప్‌లో ‘Hi’ అని మెసేజ్ పంపండి.వెంటనే మీకు రిప్లై వస్తుంది, అందులో ‘ssc హాల్ టికెట్ march-2026’ అని టైప్ చేసి పంపండి.అనంతరం వచ్చే లింక్ పై క్లిక్ చేసి.. మీ జిల్లా, స్కూల్ పేరు, పుట్టిన తేదీ వివరాలు ఇస్తే హాల్ టికెట్ డౌన్‌లోడ్ అవుతుంది.

ఈ ఏడాది హాల్ టికెట్లపై ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్‌ను ముద్రించారు. దీన్ని స్కాన్ చేయడం ద్వారా,పరీక్షా కేంద్రం యొక్క ఖచ్చితమైన అడ్రస్ తెలుసుకోవచ్చు,మీ ఇంటి నుంచి సెంటర్‌కు ఉన్న దూరం, చేరుకోవడానికి పట్టే సమయం గూగుల్ మ్యాప్స్ ద్వారా చూడవచ్చు.మొత్తం విద్యార్థుల సంఖ్య 5,28,248 మంది కాగా ,పరీక్షలు మార్చి 14 నుండి ఏప్రిల్ 16 వరకు, హాల్ టికెట్‌లో పేరు లేదా ఇతర వివరాల్లో తప్పులు ఉంటే వెంటనే సంబంధిత స్కూల్ హెచ్‌ఎం (HM) దృష్టికి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు.ఆన్‌లైన్ లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న హాల్ టికెట్లను పరీక్షా కేంద్రాల్లో అనుమతిస్తారని బోర్డు డైరెక్టర్ పీవీ శ్రీహరి స్పష్టం చేశారు.

Loading

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *